సుకుమార్‌కు ప్రయోగాత్మక చిత్రాలు తీస్తాడనే పేరుంది. అది మహేష్ అయినా బన్నీ అయినా ఆయన తరహా మాత్రం విభిన్నంగా ఉంటుంది. తాను నమ్ముకున్న విధంగా కొత్తదనానికి సుకుమార్ పెద్ద పీట వేస్తాడు. సామాన్యప్రేక్షకులకు అర్థం కాని వైవిధ్యభరితమైన సినిమాలు తీస్తాడు. కానీ ఎన్టీఆర్ కోసం మాత్రం సుకుమార్ మారాడు. ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో స్టైలిష్ రివేంజ్ డ్రామా పుష్కళంగా ఉందిట. ఇందులో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతం అంటున్నారు. తన ప్రయోగాలను పక్కనపెట్టి ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్లుగా కమర్షియల్ దారిలో లెక్కల మాష్టార్ పయనిస్తున్నాడు. మహేష్‌బాబుతో చేసిన '1'లో చేసిన పొరపాటును మరోసారి చేయకుండా పక్కా కమర్షియల్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నాడు. గతంలో రాజమౌళి వంటి దర్శకుడు కూడా సుక్కు పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను తీస్తే మాకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటాడని కాంప్లిమెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆయన రాజమౌళి మాటలను దృష్టిలో పెట్టుకొని 'నాన్నకు ప్రేమతో' తీస్తున్నాడు. వాస్తవానికి 'ఆర్య' తర్వాత సుక్కుకు ఆ స్థాయి విజయం మరలా లభించలేదు. కానీ 'నాన్నకు ప్రేమతో'తో మరో బ్లాక్‌బస్టర్ కొట్టి తాను కమర్షియల్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకునే పనిలో సుక్కు నిమగ్నమై ఉన్నాడు.