ఐ లవ్ యూ రస్నా అంటూ రస్నా బేబీగా అందరికీ తెలిసిన అంకిత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై ప్రేమలో పావని కళ్యాణ్, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, సింహాద్రి, విజయేంద్రవర్మ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో తన నటనతో, తన గ్లామర్‌తో హీరోయిన్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్ తెచ్చుకుంది. అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన అంకిత సడన్‌గా యు.ఎస్. షిఫ్ట్ అయింది. సినిమా టెక్నాలజీకి సంబంధించిన కోర్స్‌ను యూనివర్సల్ స్టూడియోలో చేసింది. కొందరు హాలీవుడ్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేసింది. సినిమా టెక్నాలజీ నేర్చుకోవాలన్న ఉత్సాహం వెనుక ఫ్యూచర్‌లో డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశం వుందో ఏమో తెలీదుగానీ, ఇప్పుడు మాత్రం పెళ్ళికి రెడీ అయింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన విశాల్ జగ్తాప్‌ను పెళ్ళాడబోతోంది. ఈరోజు(నవంబర్ 6) ఉదయం ముంబైలోని జె.పి. మారియట్ హోటల్‌లో పెద్దల సమక్షంలో అంకిత, విశాల్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.