ఇప్పటివరకు దర్శకుడు శంకర్ గానీ సూపర్‌స్టార్ రజనీకాంత్ గానీ 'రోబో2' విషయంలో అధికారికంగా నోరు విప్పలేదు. అయినా వార్తలు మాత్రం ఆగడం లేదు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేలోగా ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలతో ఓ పుస్తకాన్నే విడుదల చేయవచ్చని సినీ పండితులు వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా..రజనీకి అపోజిట్‌గా హాలీవుడ్ హీరో అర్నాల్డ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అర్నాల్డ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. ఈ కండీషన్స్‌లో ముఖ్యంగా 100కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. తాజాగా ఆయన స్క్రిప్ట్‌ని కూడా చేంజ్ చేయాలని కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడట. ఇందుకోసం హాలీవుడ్ స్క్రీన్‌ప్లే రైటర్ల సహాయం తీసుకోవాలని, అప్పుడు తాను ఈ సినిమాలో నటిస్తానని అంటున్నాడట అర్నాల్డ్.