తన కెరీర్‌లో ఎన్నో అద్భుత పాత్రలు చేసి నభూతో నభవిష్యతి అన్నరీతిలో తాను నటించే పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటి రమ్యకృష్ణ. ఆమె టాలెంట్ ఏమిటనేది 'నరసింహ, బాహుబలి' చిత్రాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. 'బాహుబలి'లో ఆమె చేసిన శివగామి పాత్ర చిత్రానికే హైలైట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా గతంలో రమ్యకృష్ణ కొన్ని సీరియల్స్‌లో కూడా నటించింది. తాజాగా ఆమె ముఖ్యపాత్ర పోషించిన 'కుటుంబం' అనే సీరియల్ జెమినీ చానెల్‌లో ప్రసారం కానుంది. నవంబర్ 9 నుంచి ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది. 'బాహుబలి' తర్వాత రమ్యకృష్ణకి వచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల ఈ సీరియల్‌ను ఎక్కువ శాతం వీక్షకులు చూసే అవకాశం ఉందని, ఈ సీరియల్ తమకు మంచి టీఆర్పీ రేటింగ్స్ తీసుకొస్తుందని జెమిని చానెల్ యాజమాన్యం ఎన్నో ఆశలు పెట్టుకొంది.