ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ శ్రీవాస్ దర్శకత్వంలో 'డిక్టేటర్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని ఖరారుచేసినట్లు సమాచారం. డిసెంబర్ 20వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని అనుకొంటున్నారు. కాగా జనవరి 8వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఈ చిత్ర బృందం.. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా బాబాయ్‌తో పోటీ పడకుండా ఆయన వచ్చిన తర్వాత గ్యాప్ చూసుకొని మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ తన యూనిట్‌ను ఆదేశించాడని అంటున్నారు. మరి కొద్దిరోజుల్లో ఈ విషయమై క్లారిటీ రానుంది.