రీసెంట్ గా జరిగిన 'సైజ్ జీరో' ఆడియో వేడుకలో అలీ స్టేజీ మీద అనుష్క తొడల గురించి కామెంట్ చేసాడు. ఈ విషయంపై చాలా మంది రియాక్ట్ అవ్వడం చూసి అలీ తనదైన శైలిలో స్పందించాడు. ఎన్నో చిత్రాల్లో బూతు పదాలు ఉంటున్న వాటిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు.. ఆడియో ఫంక్షన్ లో సరదాగా నవ్వించడానికి నేను అన్న మాటలకు తెగ గోల చేస్తున్నారని అలీ చెబుతున్నాడు. ఇది ఇలా ఉంటే అనుష్క కు రానా మంచి స్నేహితుడు. అనుష్క, రానాను బ్రదర్ అని కూడా పిలుస్తుంది. అయితే అలీ, అనుష్కపై కామెంట్ చేసినప్పుడు స్వీటీ నవ్వినా, తరువాత మాత్రం చాలా బాధపడిందట. ఈ విషయంపై రానా రియాక్ట్ అయ్యి అలీ కు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి..!