'ఆంద్రుడు' తో పరుచూరి మురళి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత 'పెదబాబు' కూడా ఓకే అనిపించుకొంది. కాగా ఇటీవల ఆయన బాలకృష్ణ హీరోగా చేసిన 'అధినాయకుడు' చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో పరుచూరి మురళి పేరు ఎక్కడా వినిపించడం లేదు. కాగా ఆయన మరోసారి గోపీచంద్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన గోపీచంద్‌ను కలిసి ఓ స్టోరీ వినిపించాడట. అది గోపీచంద్‌కు బాగా నచ్చిందని దాంతో వెంటనే ఆయన ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్, రెజీనాతో కలిసి 'సౌఖ్యం' చిత్రంలో నటిస్తున్నాడు. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం విడుదలైన వెంటనే పరుచూరి మురళి చిత్రం ప్రారంభం అవుతుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి భగవాన్, పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.