వచ్చే సినిమాలు వస్తున్నాయ్.. పోయే సినిమాలు పోతున్నాయ్. వరస సినిమాలతో రకుల్ ప్రీత్‌సింగ్ దూసుకుపోతోంది. వాస్తవానికి ఆమెకు లౌక్యం తర్వాత సరైన హిట్ లేదు. కరెంటుతీగ, పండగ చేస్కో, కిక్2, బ్రూస్‌లీ వంటి వరస ప్లాప్‌లతో ఆమె కెరీర్ సాగుతోంది. అయినా కూడా ఆమె వెనకే మన వారు వెంట పడుతున్నారు. ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన 'నాన్నకు ప్రేమతో', అల్లుఅర్జున్ సరసన 'సరైనోడు' చిత్రాల్లో నటిస్తోంది. ఇక మరో మెగా హీరో వరుణ్‌తేజ్ నటించనున్న తాజా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఈచిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా, ఠాగూర్ మధు నిర్మాత. ఇక ఆమె త్వరలో నితిన్ సరసన కూడా నటించనుంది. మొత్తానికి ఆమెకు ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా ఐరన్‌లెగ్ ముద్ర పడకుండా ఇంకా వరుస క్రేజీ చిత్రాల్లో చాన్స్‌లు దక్కించుకోవడం ఆమె అదృష్టం అనే చెప్పాలి.