ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బేనర్‌లో అల్లుఅరవింద్ 'సరైనోడు' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అల్లుఅర్జున్ స్టైల్‌కు బోయపాటి యాక్షన్ ఎలిమెంట్స్‌ను కలగలిపిన ఓ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చేఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ డేట్‌ను ఇప్పుడు లాక్ చేశారు. సో.. వచ్చే సమ్మర్‌కు బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకున్న తొలి చిత్రం 'సరైనోడు' కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్8 తేదీ 2016న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.