మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రంగా తమిళంలో హిట్ అయిన 'కత్తి' సినిమా రీమేక్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నప్పటికీ ఈ చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఆ చిత్రాన్ని చిరు చేస్తాడా? లేదా? అన్నది కూడా తేలడం లేదు. కాగా తాజాగా చిరు కన్ను ఓ మొదలు కాని బాలీవుడ్ మూవీపై పడిందని సమాచారం. సంజయ్‌దత్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో గతంలో మున్నాబాయ్ సిరీస్‌లో రెండు భాగాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈరెండు చిత్రాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'శంకర్‌దాదా యం.బి.బి.యస్., శంకర్‌దాదా జిందాబాద్'లుగా రీమేక్ చేశాడు. కాగా ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరాణి సంజయ్‌దత్‌తో 'మున్నాబాయ్' సిరీస్‌లో మూడో చిత్రాన్ని తీయడానికి రెడీ అవుతున్నాడు. స్టోరీ కూడా ఫైనలైజ్ అయింది. ఈ చిత్రం హిందీలో పట్టాలెక్కితే తెలుగులో దానికి చిరు చేయడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే శంకర్‌దాదాగా చిరును తప్ప వేరే హీరోని ఊహించుకోవడం కష్టం...! దాంతో ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా? అనే ఎదురుచూపులు చూస్తున్నాడు మెగాస్టార్.