అక్కినేని వంశ వారసుడు, నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ నటించిన తొలి మూవీ 'అఖిల్' చిత్రం నవంబర్ 11న రానున్న సంగతి తెలిసిందే. అయినా అఖిల్‌కు పోటీగా సల్మాన్‌ఖాన్ 'ప్రేమలీల', 'చీకటిరాజ్యం' చిత్రాలు వస్తున్నప్పటికీ అవి పెద్దగా 'అఖిల్' చిత్రానికి పోటీ కాదనే చెప్పాలి. ఇక అజిత్ అయితే తన 'ఆవేశం' (వేదలమ్)ను తమిళనాడులో నవంబర్ 10న విడుదల చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసుకొన్నాడు. దాంతో 'అఖిల్'కు మన హీరోలు రెండు వారాల లాంగ్ గ్యాప్ ఇచ్చారు. రవితేజ వంటి హీరో కూడా తన 'బెంగాల్‌టైగర్'ను నవంబర్ 27కు వాయిదా వేసుకున్నాడు. ఇక అనుష్క 'సైజ్‌జీరో' కూడా అదే రోజు విడుదలకానుంది. ఇక కోనవెంకట్ కూడా తన సొంత చిత్రమైన 'శంకరాభరణం'ను డిసెంబర్ 4కు వాయిదా వేసుకొన్నాడు. ఇక 'అఖిల్' వల్ల నష్టపోయేవారి జాబితాలో ఆయన అన్నయ్య నాగచైతన్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం నాగచైతన్య గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో చేస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రానికి తెలుగు నిర్మాత అయిన కోనవెంకట్ తమ్ముడి కోసం అన్నయ్య సినిమాను వెనుకకు తోసి వేశాడు. సో.. 'అఖిల్'కు ఎవ్వరూ పోటీ రాకుండా సోలోగా రావడానికి అందరూ కలిసికట్టుగా వెనక్కి వెళుతూ, ఆయన కోసం తమ సినిమాలను త్యాగం చేస్తున్నారు.