హీరోగా బ్రేక్ తీసుకొని నిర్మాణ రంగంలో తండ్రి సుధాకర్ రెడ్డికి తోడయిన నితిన్, అందరం అనుకున్నట్లుగానే అఖిల్ చిత్రాన్ని ఎవరూ ఊహించని నిర్మాణ విలువలతో మన ముందుకు తీసుకు వస్తున్నాడు. మరి తాను ఖర్చు పెట్టాడు కాబట్టి తన మీద కూడా వేరే నిర్మాతలు డబ్బులు పోయాల్సిందే అన్నట్టుగా ఉందట నితిన్ కొత్త చిత్రం అ..ఆ తంతు. మాటల మాయగాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అ...ఆ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అఖిల్ రిలీజు దృష్ట్యా నితిన్ కొంచెం బ్రేక్ తీసుకున్నా త్రివిక్రమ్ మిగతా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నాడు. ఎట్టి పరిస్తుతుల్లోను మరో మూడు నెలల్లో ఈ మూవీ విడుదల అవబోతోంది అంటే వీరి స్పీడు ఏ రేంజులో ఉందొ తెలుసుకోవచ్చు. నిర్మాత చిన బాబు కూడా డబ్బుల విషయంలో వెనకాడకుండా భారీ స్థాయిలో చిత్రీకరణకు ఖర్చు చేస్తుండడం అ...ఆకు పెద్ద అసెట్ అవుతోందట. కేవలం ఒకే ఒక్క సన్నివేశం షూటింగ్ కోసం యాభై ఫారెన్ బ్రాండ్ కార్లు అద్దెకు తీసుకొచ్చారంటే త్రివిక్రమ్ ఎంతలా తీ(యి)స్తున్నాడో చూడండి. చూడబోతే నితిన్ కెరీర్ మొత్తంలో విపరీతమైన బడ్జెటుతో తీసే చిత్రరాజంగా అ...ఆ కీర్తి గడిస్తుందేమో. ఎన్ని ఉంటె ఏమిటి, త్రివిక్రమ్ మొన్నటి సత్యమూర్తి లాగానే కథలో కోతలు పెట్టకపోతే చాలు.