Advertisementt

అఖిల్ ఎనర్జీ ముందు చరణ్ నిలబడేనా?

Thu 05th Nov 2015 01:50 PM
akkineni akhil,akhil,ram charan,chirutha  అఖిల్ ఎనర్జీ ముందు చరణ్ నిలబడేనా?
అఖిల్ ఎనర్జీ ముందు చరణ్ నిలబడేనా?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ విడుదల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. రెండు రోజుల క్రితం తమిళంలో విడుదల చేసిన అఖిల్ ట్రైలరుకు అక్కడ కాదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన  లభించింది. అక్కినేని బుడ్డోడిలో అదిరిపోయే ఎనర్జీ ప్రతి షాటులోను తేటతెల్లం అయింది. స్టంట్స్, డ్యాన్స్ అయితే అఖిల్ మొదటి సినిమాలోలా అసలే లేవు. ఎంతో ఎక్స్పీరియెన్స్ ఉన్న నటుడిలా కెమెరా ముందు జంకు బొంకు లేకుండా ఇరగదీసాడు. ఇంతటి ఈజ్ మొదటి సినిమాలోనే అప్పట్లో ప్రదర్శించింది తప్పకుండా చిరుత రామ్ చరణ్. కానీ తంతు చూడబోతుంటే అఖిల్ ప్రిపరేషణ్ ముందు చరణ్ రికార్డులు నిలవగలవా అన్న అనుమానం కలుగుతుంది. అక్కినేని హీరోలంటే నటనా కౌశల్యం విషయంలో పేరు గడించిన వారే అయినా అఖిల్ ముందు ఎంతటి టఫ్ టాస్క్ అయినా ఇంతలా కొట్టిన పిండి అవుతుందని అనుకోలేదు.  ఇదే విషయం గనక తెర మీద రిపీట్ అయితే అఖిల్ ఫస్ట్ మూవీతోనే ఫాస్టుగా స్టార్ హీరోల సరసన చోటు కొట్టేస్తాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ