Advertisementt

మహేష్‌-మురుగ సినిమాకు ముహూర్తం ఖరారు!

Thu 05th Nov 2015 10:27 AM
mahesh babu,brahmothsawam movie,murugadoss,sruthihassan  మహేష్‌-మురుగ సినిమాకు ముహూర్తం ఖరారు!
మహేష్‌-మురుగ సినిమాకు ముహూర్తం ఖరారు!
Advertisement
Ads by CJ

'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మొత్సవం' చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం విషయంలో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. బాలనటునిగా మహేష్‌బాబు కూడా అప్పట్లో తన తండ్రి నటించిన చిత్రాల్లో నటించి ఆ తర్వాత హీరోగా మారాడు. ఇక '1' (నేనొక్కడినే) చిత్రంలో మహేష్‌ కుమారుడు గౌతమ్‌కృష్ణ ఓ చిన్న పాత్ర చేసి తన యాక్టింగ్‌ స్కిల్స్‌తో మెప్పించి అవార్డులు కూడా పొందాడు. కాగా 'బ్రహ్మొత్సవం' చిత్రంలో మహేష్‌బాబు కూతురు సితార ఓ చిన్న సన్నివేశంలో కనిపించి వెండితెరపై ప్రత్యక్షం కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్‌బాబు మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌తో కలిసి ఠాగూర్‌మధు నిర్మించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 12వ తేదీ, 2016లో లాంచింగ్‌ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో ఓ హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తుండగా మరో పాత్రకు హీరోయిన్‌ అన్వేషణలో ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ