'బ్రూస్‌లీ' అందించిన చేదు ఫలితాన్ని పక్కనపెట్టి తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు రామ్‌చరణ్. అందులో భాగంగా ఆయన తమిళ 'తని ఒరువన్' రీమేక్‌లో నటించడం ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన పలు హీరోయిన్లను అనుకున్న చరణ్-సురేందర్‌రెడ్డిలు చివరకు ఇలియానా అయితే బాగుంటుందని, ఆమెను పెట్టుకుంటే ఫ్రెష్ కాంబినేషన్‌గా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులోనూ ఇలియానా ఇప్పుడు పెద్దగా బిజీ కాకపోవడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో నటించే ప్రతినాయకుడి పాత్రపై మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. ఈ పాత్రను నాగార్జున చేతనే చేయించాలని యూనిట్ ఆశ పడుతోంది. మరోపక్క ఆయన నో చెబితే సెకండ్ ఆప్షన్‌గా తమిళంలో నటించిన అరవింద్‌స్వామినే తెలుగులో కూడా నటించాలని కోరే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.