Advertisementt

అమ్మకు ప్రేమతో... సుకుమార్!

Wed 04th Nov 2015 04:52 PM
sukumar,ammaku prematho,kumari 21f,nannaku prematho,sukumar movies,sukumar mother  అమ్మకు ప్రేమతో... సుకుమార్!
అమ్మకు ప్రేమతో... సుకుమార్!
Advertisement
Ads by CJ

ప్రేమ.. రెండక్షరాల మహాకావ్యం.. రెండు కన్నీటి చుక్కల మహాసంద్రం.. ‘ఆర్య’ చిత్రంలో ప్రేమ గురించి సుకుమార్ చెప్పిన ఈ గాఢమైన సంభాషణ ఇప్పటికీ చాలా మందికి గుర్తుండిపోయింది. ఇప్పటి వరకు యూత్‌ఫుల్ ప్రేమను వెండితెరపై 'ఆర్య, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్' చిత్రాల్లో ఆవిష్కరించిన... సుకుమార్ ఇప్పుడు కుటుంబ భావోద్వేగాల సమహారంతో.. అమ్మనాన్నల ప్రేమలను.. వారి ఆప్యాయత అనురాగాలను ఆవిష్కరించడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ రూపొందిస్తున్న సుకుమార్ ఈ చిత్రంలో అంతర్లీనంగా తండ్రి,కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్నాడు..ఈ చిత్ర కథకు సుకుమార్‌కు, ఆయన తండ్రికి వున్న అనుబంధం ప్రేరణ అని తెలిసింది. కాగా సుకుమార్ తనకు అమ్మపై వున్న ప్రేమ ఏంటో  ఇటీవల జరిగిన ‘కుమారి 21ఎఫ్’ ఆడియోలో చూపించాడు. సుకుమార్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ ఆడియో వేడుక జరుగుతున్నప్పుడు అతిథుల సమక్షంలో సుకుమార్ మాట్లాడుతూ మధ్యలో స్టేజీ దిగిపోయి అమ్మ ఒడిలో వాలిపోయి.. అమ్మ ఆశ్శీస్సులు తీసుకొని.. అమ్మపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు. సో.. సుకుమార్ త్వరలో మదర్ సెంటిమెంట్‌తో ఓ సినిమా తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ