హిట్ ఇస్తే నెత్తిన పెట్టుకోవడం, ఫ్లాప్ వస్తే దూరంగా ఉంచడం సినీ రంగంలో సాధారణమే. అది అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ సినీ రంగంలో ఇది ఎక్కువ. కాగా తమకు సూపర్‌హిట్స్ ఇచ్చి కోట్లాది రూపాయల లాభాలను ఇచ్చిన డైరెక్టర్‌ను వదులుకోవడానికి ఏ నిర్మాత కూడా ఒప్పుకోడు. అందుకే తమకు అవసరం ఉన్నప్పుడు మరలా ఆ డైరెక్టర్ తమను ఆదుకోకపోతాడా? అని నిర్మాతలు ఆలోచనగా చెప్పాలి. అందుకే తమకు సూపర్‌హిట్స్ ఇచ్చిన దర్శకులకు భారీ గిఫ్ట్‌లు ఇస్తూ తమ పబ్బం గడుపుకోవాలని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. చాలారోజుల కిందట ఓ ఖరీదైన డైమండ్ లైటర్‌ను నిర్మాత బండ్ల గణేష్ పూరీజగన్నాథ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చి సంచలనం సృష్టించాడు .కాకాపట్టడంలో మాస్టర్ డిగ్రీ చేసిన బండ్ల గణేష్ చూపించిన బాటలోనే మరికొందరు నిర్మాతలు నడుస్తున్నారు. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ను తనకిచ్చి నాన్ 'బాహుబలి' రికార్డులను కొల్లగొట్టిన దర్శకుడు కొరటాల శివ. ఈ దర్శకునికి నిర్మాతల్లో ఒకరైన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఓ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చి సంతోషపరిచాడు. కాగా తమ సంస్థకు 'భలే భలేమగాడివోయ్'తో కలెక్షన్ల పంట పడించిన దర్శకుడు మారుతికి ఈ చిత్రాన్ని నిర్మించిన సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ అదినేతలు జాక్వర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని విలువ 80లక్షలు ఉంటుందిట. ఇలా తమకు హిట్ ఇచ్చిన దర్శకుల టాలెంట్‌ను వెలకట్టలేమని డిసైడ్ అయిన నిర్మాతలు ఇలా భారీ గిఫ్ట్‌లతో ఆయా దర్శకులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు.