ఇప్పుడు కొంతమంది హీరోల తలపై కత్తి వేలాడుతోంది. ఇంతకాలంగా సంపాదించుకున్న మార్కెట్ పడిపోతోంది. దాంతో రాబోయే సినిమాలతో హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో ముందుగా రవితేజను చెప్పుకోవాలి.ఆయన నటించిన 'బెంగాల్‌టైగర్' ఆయన కెరీర్‌కే కీలకంగా మారింది. 'కిక్2' డిజాస్టర్‌తో పాటు గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు ఫ్లాప్స్‌గా లేదా యావరేజ్‌లుగా మాత్రమే మిగిలాయి. 'బెంగాల్‌టైగర్' హిట్టయితేనే రవితేజ ఫామ్‌లోకి వస్తాడు. ఇక యువహీరో నిఖిల్ వరుస విజయాలతో సాగుతున్నప్పటికీ ఆయన నటించిన 'శంకరాభరణం' చిత్రం ఆయన కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్టయితేనే ఆయనకున్న మార్కెట్ మరింత పెరుగుతుంది. ఇక అక్కినేని అఖిల్ తన డెబ్యూ మూవీ 'అఖిల్'పై ప్రేక్షుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా జరిగింది. తన తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి తనేంటే నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు అఖిల్. ఈ చిత్రం ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా అది ఆయనకు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుంది. ఇక నాగచైతన్యకు '100%లవ్' చిత్రం తర్వాత సోలో హిట్ లేదు. 'తడాఖా, మనం' హిట్టయినప్పటికీ అవి సోలో సినిమాలు కావు. దాంతో అతను 4ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. మరి ఆయన కోరికను గౌతమ్‌మీనన్ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో మాయ చేస్తాడేమో చూడాలి..!ఇలా మన హీరోలలో కొందరి తలపై కత్తి వేలాడుతోంది. డూ ఆర్ డై పరిస్థితిలో వారు ఉన్నారని చెప్పవచ్చు.