Advertisementt

కోలీవుడ్‌లో హోరాహోరి..!

Wed 04th Nov 2015 08:58 AM
ajith,aavesam movie,kamal hassan,cheekati rajyam movie  కోలీవుడ్‌లో హోరాహోరి..!
కోలీవుడ్‌లో హోరాహోరి..!
Advertisement
Ads by CJ

తమిళనాడులో దీపావళి అతి పెద్ద ముఖ్యమైన పండుగ. మనకు దసరా, సంక్రాంతి ఎలానో తమిళంలో దీపావళికి తమ సినిమాలతో అంత సందడి చేస్తారు తమిళ హీరోలు. కాగా ఈ దీపావళికి ఇద్దరు స్టార్స్‌ మధ్యన హోరాహోరీ పోరుకు రంగం సిద్దమైంది. ఒకే రోజున ఇద్దరు స్టార్స్‌ తమ చిత్రాలను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. తమిళంలో లోకనాయకుడు కమల్‌హాసన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరో అజిత్‌ అంటే తమిళంలో రజనీకాంత్‌ తర్వాత అంతటి స్టార్‌డమ్‌ ఉన్న స్టార్‌ ఆయన. వీరిద్దరు ఈసారి దీపావళికి ఒకేసారి కత్తులు దూస్తున్నారు. అజిత్‌ నటించిన 'వేదలమ్‌' (తెలుగులో 'ఆవేశం'), కమల్‌హాసన్‌ 'తూంగావనం' (తెలుగులో 'చీకటిరాజ్యం') చిత్రాలు రెండూ నవంబర్‌ 10న విడుదలకు సిద్దమవుతున్నాయి. కాగా ఇప్పటివరకు కమల్‌హాసన్‌, అజిత్‌లు ఓకేసారి మూడు సార్లు పోటీపడితే రెండు సార్లు పైచేయి అజిత్‌దే అయింది. అందులోనూ అజిత్‌కు దీపావళి సెంటిమెంట్‌ ఉంది. వరుసగా మూడు హిట్స్‌తో ఊపుమీదున్న అజిత్‌తో పోటీపడుతున్న కమల్‌కూడా ఇటీవలే 'పాపనాశం' తో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో ఈసారి గెలుపు ఎవరిది? అనేది అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ