కేవలం రెండో చిత్రంతోనే రామ్‌చరణ్ హీరోగా వచ్చిన 'రచ్చ' చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్‌నంది ఇండస్ట్రీ మొత్తానికి తనేంటో చూపించాడు. ఆ వెంటనే పవన్‌కళ్యాణ్.. 'గబ్బర్‌సింగ్2' చిత్రానికి ఛాన్స్ ఇస్తానని ఎంతో కాలం వెయిట్ చేయించి చివరకు ఆ ప్రాజెక్ట్ వేరేవాళ్ళ చేతిలో పెట్టాడు. వాస్తవానికి సంపత్ నందికి కసితోపాటు నమ్మకం కూడా ఎక్కువే అని చెప్పాలి. పవన్ కాదు అనగానే సింగల్ సిట్టింగ్ లో రవితేజతో కథ ఓకే చేయించి 'బెంగాల్‌టైగర్' చేశాడు. ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. కాగా మొదటిసారిగా సంపత్‌నంది.. పవన్‌కళ్యాణ్ సినిమాపై నోరు విప్పాడు. త్వరలో తాను పవన్ హీరోగా ఓ చిత్రం చేయనున్నానని, సబ్జెక్ట్ కూడా రెడీ అయిందని, సినిమా చేద్దామని పవన్ కూడా హామీ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. తన ఐదేళ్ల కెరీర్‌లో జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని, పొగడ్తలను, విమర్శలను, గౌరవాన్ని , అవమానాన్ని, ఎత్తుపల్లాలను చవిచూసిన సంపత్‌కు.. తాను అనుకున్నది సాధించడానికి ఎంతైనా తెగించే పట్టుదల ఉందని అంటున్నారు. తనను కాదన్న పవన్‌కళ్యాణ్‌ను మరలా మెప్పించి దర్శకునిగా తనేంటో ప్రూవ్ చేయాలనుకొంటున్నాడు. కాగా 'బెంగాల్‌టైగర్' ఫలితం మీదనే సంపత్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. 'బెంగాల్‌టైగర్' హిట్టయితే వెంటనే పవన్ సినిమాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.