Advertisementt

పవన్‌ అండతో రెచ్చిపోతున్న బాబి..!

Mon 02nd Nov 2015 07:37 PM
pawan kalyan,bobby,sardhar gabbar singh,sankranthi release  పవన్‌ అండతో రెచ్చిపోతున్న బాబి..!
పవన్‌ అండతో రెచ్చిపోతున్న బాబి..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. గబ్బర్‌సింగ్‌2 కోసం ఆయన ఎన్నోరోజులు వేస్ట్‌ చేశాడు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో వరుసగా రెండు పడవలపై ప్రయాణం చేసాడు. అలా చేయడం కెరీర్‌కు నష్టమని ఎవరు చెప్పినా డోంట్‌ కేర్‌ అనుకున్నాడు. అయితే తాజాగా ఆయన తన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ను ప్రారంబించాడు. మనసులో ఏమనుకున్నాడో ఏమోగానీ ఈ చిత్రాన్ని సంక్రాంతికానుకగా విడుదల చేయనున్నాం అని అభిమానులకు హామీ ఇచ్చేశాడు. షూటింగ్‌ అనుకున్న సమయానికి ప్రారంభించి ఉంటే సంక్రాంతికి రావడం గ్యారంటీ అనుకునేవారు. కానీ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టడానికి చాలా ఆలస్యం చేశాడు. దీంతో పవన్‌ సంగతి తెలిసిన వారు ఎంత చేసినా ఈ చిత్రం సంక్రాంతికి రావడం కష్టమని భావించారు. అయితే ఒక్కసారి ఫిక్సయితే తన మాట తానే వినని పవన్‌ ఈ చిత్రం షూటింగ్‌ కోసం రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు. పవన్‌ బాగా కోఆపరేట్‌ చేస్తూండటంతో దర్శకుడు బాబీ కూడా చెలరేగిపోతున్నాడు. ఫటా ఫట్‌..ధనా ధన్‌ అంటూ షూటింగ్‌ను చేస్తున్నాడు. రామానాయుడు స్టూడియోస్‌లో షూటింగ్‌ జరుపుకొని, ఆ తర్వాత గుజరాత్‌ వెళ్లిన చిత్ర బృందం అప్పుడే అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకొని హైదరాబాద్‌ చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ షెడ్యూల్‌ను సాద్యమైనంత త్వరగా పూర్తి చేసుకొని రాజస్థాన్‌ వెళ్లనుంది. మొత్తానికి టాకీ పార్ట్‌ను డిసెంబర్‌లోపు పూర్తి చేసి సంక్రాంతి పండుగకు తేవాలనేది పవన్‌ ప్లానింగ్‌గా కనిపిస్తోంది. మరి పవన్‌ తాను అనుకున్నట్లు ఈ చిత్రాన్ని సంక్రాంతికి తెస్తాడా? లేక సమ్మర్‌లో నిదానంగా రిలీజ్‌ చేసుకుంటాడా? అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ