యువతరం దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కానీ అందరి పంథాల్లోకెల్లా సరికొత్త పంథా చంద్రశేఖర్ ఏలేటిది. ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా, తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయించుకుని మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఏలేటి నుండి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసే జనాలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఐతే నుండి సాహసం వరకు, ప్రతి చిత్రంలో ఏదో ఒక వినూత్న అంశం మీద, టెక్నిక్ మీద బేస్ చేసుకునే ముందుకు సాగాడు.
ఏలేటి ప్రస్తుతానికి మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి, ఇర్ఫాన్ ఖాన్ లాంటి గొప్ప కళాకారులతో బహు-భాషా చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్కులో తలమునకలయ్యాడు. వారాహి చలన చిత్రం సంస్థ అధినేత సాయి కొర్రపాటి నిర్మించబోతున్న ఈ చిత్రానికి మహిమ అన్న పేరు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. మహిమ అనే పదానికి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఒకే అర్థం ధ్వనిస్తుంది కాబట్టి ఇది మంచి సెలెక్షన్. కేవలం కన్నడ వెర్షన్ కోసం మాత్రమే మోహన్ లాల్ స్థానే శివరాజ్ కుమార్ నటించబోతున్నాడు. కాసింత గ్యాప్ తీసుకున్నా సరే, ఏలేటి మరోసారి ఐతే మహిమ చూపితే మావాడు ఒక్కడున్నాడు అని దక్షిణాన గర్వంగా చెప్పుకోవచ్చు.