మెగా కుటుంబంలో వున్న మనస్పర్థలు మెల్ల మెల్లగా బహిర్గతమవుతున్నాయి. ప్రస్తుతానికి మెగా కాంపౌండ్‌కు దూరంగా వుంటున్న పవన్‌కళ్యాణ్ బాటలోనే అల్లు అర్జున్‌కు కూడా పయనిస్తున్నాడా? అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. శనివారం రాత్రి జరిగిన కుమారి 21ఎఫ్ ఆడియోలో ఈ విషయం మరింత బలపడింది. సుకుమార్ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్ర ఆడియో వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. శిల్పాకళావేదికలో జరిగిన ఈ ఫంక్షన్‌కు అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ పేరుతో ప్రింట్ చేసిన ప్రత్యేక టీషర్టులో హాజరై.. నానా హంగామా క్రియేట్ చేశారు. ప్రతిసారి మెగా అభిమానులు అందరూ మెగా కుటుంబానికి చెందిన అన్ని ఫంక్షన్లకు హాజరై ఐక్యతను చాటుతారు. ఈసారి మాత్రం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్సే.. మేము అన్నట్లుగా అక్కడికి వచ్చిన అభిమానులు ప్రవర్తించారు. అయితే ఇటీవల మెగాకుటుంబానికి- అల్లు కుటుంబానికి మధ్య వచ్చిన మనస్పర్థల వల్లే అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను కోరుకుంటున్నాడని తెలిసింది. ఇటీవల బ్రూస్‌లీ విడుదల సమయంలో అల్లుఅర్జున్ గోన్నా గన్నారెడ్డిగా నటించిన రుద్రమదేవి ని విడుదల చేయడం.. రుద్రమదేవి గురించి బ్రూస్‌లీ విడుదలను వాయిదా వేయాలనడంతో పాటు బ్రూస్‌లీ డిజాస్టర్‌గా నిలవడం.. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అభినయానికి ప్రశంసలు రావడం మెగాస్టార్ చిరంజీవికి మింగుడుపడటం లేదని వినికిడి..తమ పేరు చెప్పుకొని వచ్చినవాళ్లు తమ పట్ల విధేయులుగా వుండటం లేదని చిరు చిందులేస్తున్నాడని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.. సో.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అల్లు అర్జున్ సొంత కుంపటి రెడీ చేసుకుంటున్నాడు. సో.. అల్లు వారసుడు ఎంతైనా తెలివైనోడు... మామకు సరైనోడు అంటున్నారు సినీజనాలు.