వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే సృజనాత్మక దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఆర్య చిత్రంతో ప్రేమకథా చిత్రాల్లో నూతన ఒరవడిని సృష్టించిన సుకుమార్ ఆ తర్వాత పలు విభిన్న చిత్రాలను రూపొందించాడు. ఆర్య తర్వాత బన్నీతో ఆర్య-2 ను రూపొందించిన సుకుమార్ అల్లు అర్జున్‌తో ముచ్చటగా మూడో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆర్య చిత్రంతో అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పిన సుకుమార్‌తో ఆర్య ను మించిన చిత్రాన్ని చేస్తానని బన్నీ ప్రకటించాడు. శనివారం రాత్రి జరిగిన కుమారి 21 ఎఫ్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానుల ముందు తెలియజేశాడు.