Advertisementt

పవన్‌తో మాత్రం కలిసి నటించనంటున్నాడు!

Mon 02nd Nov 2015 10:07 AM
pawan kalyan varun tej,kanche,mukunda,pawan fear to varun tej,fear  పవన్‌తో మాత్రం కలిసి నటించనంటున్నాడు!
పవన్‌తో మాత్రం కలిసి నటించనంటున్నాడు!
Advertisement
Ads by CJ

తన మొదటి చిత్రం ముకుంద ద్వారా ఫర్వాలేదనిపించుకొన్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ దసరా కానుకగా విడుదలైన కంచె చిత్రంతో నటనలో అద్భుతం అనిపించాడు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో మెగాప్యామిలీ నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వరుణ్‌తేజ్‌ చాలా సంతోషంగా ఉన్నాడు. కంచె చూసిన వారికి భవిష్యత్తులో తాను స్టార్‌గా ఎదగడం ఖాయమనే నమ్మకాన్ని కలిగించాడు. కాగా ఇటీవల ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరితోనైనా కలిసి నటిస్తాను. కానీ బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌తో మాత్రం కలిసి నటించే ప్రశ్నే లేదు. పవన్‌ బాబాయ్‌ అంటే నాకు చాలా భయం.. కావాలంటే మంచి సబ్జెక్ట్‌ దొరికితే అన్నయ్య రామ్‌చరణ్‌తో మాత్రం కలిసి నటించాలని ఉంది.. అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ మధ్య నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఇదే తరహా కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. మరి మెగాఫ్యామిలీలోని వారందరికీ పవన్‌కళ్యణ్‌ అంటే అంత భయం దేనికో!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ