Advertisementt

రామ్‌చరణ్‌ సినిమా చేతులు మారిందా?

Sun 01st Nov 2015 11:03 PM
thani oruvan remake,mega power star,ram charan,surendar reddy,geetha arts,nv prasad,dvv danayya,bruce lee  రామ్‌చరణ్‌ సినిమా చేతులు మారిందా?
రామ్‌చరణ్‌ సినిమా చేతులు మారిందా?
Advertisement
Ads by CJ

త్వరలో రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్‌హిట్‌ మూవీ తని ఒరువన్‌ చిత్రంను రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా మొదట్లో ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌తో కలిసి డి.వి.వి.దానయ్య నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దానయ్య ఇటీవలే రామ్‌చరణ్‌తో తీసిన బ్రూస్‌లీ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడని, అందువల్ల తని ఒరువన్‌ రీమేక్‌ నిర్మాణ బాధ్యతల నుండి ఆయన తప్పుకున్నట్లు సమాచారం. ఆ స్ధానంలోకి గీతాఆర్ట్స్‌ అధినేత అల్లుఅరవింద్‌ ఎంటర్‌ అయ్యాడట. ఇదే నిజమైతే ఎన్వీప్రసాద్‌, అల్లుఅరవింద్‌ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరి దానయ్య తన ఆర్థిక ఇబ్బందుల నుండి ఎప్పుడు బయటపడుతాడో వేచిచూడాల్సివుంది. ఈ వార్తను విన్నవారు అయ్యో..పాపం దానయ్య అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ