Advertisementt

అఖిల్‌ని దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేశారా?

Sat 31st Oct 2015 10:14 PM
telugu movie bengal tiger,bengal tiger release post poned,akhil movie releasing on 11th nov,raviteja and sampath nandi combo movie bengal tiger  అఖిల్‌ని దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేశారా?
అఖిల్‌ని దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేశారా?
Advertisement
Ads by CJ

రవితేజ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన బెంగాల్‌ టైగర్‌ నవంబర్‌ 5న విడుదల అవ్వాల్సి వుంది. అఖిల్‌, వినాయక్‌ కాంబినేషన్‌లో రూపొందిన అఖిల్‌ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 22న రిలీజ్‌ చేద్దామని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. సి.జి. వర్క్‌ కంప్లీట్‌ అవ్వకపోవడం వల్ల ఆ చిత్రాన్ని పోస్ట్‌ పోన్‌ చేశారు. అఖిల్‌ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే బెంగాల్‌ టైగర్‌ని నవంబర్‌ 5కి రిలీజ్‌ చేద్దామనుకున్నారు. కానీ, ఆ సినిమా రిలీజ్‌ వాయిదా పడడంతో నవంబర్‌ 5కి బెంగాల్‌ టైగర్‌ రావడం లేదు. మళ్ళీ మంచి డేట్‌ చూసుకొని ఎనౌన్స్‌ చేస్తామని దర్శకనిర్మాతలు చెప్తున్నారు. ఇదంతా బాగానే వుంది. ఈరోజు ఆ సినిమాకి సంబంధించి మీడియాకు విడుదల చేసిన న్యూస్‌లో బెంగాల్‌ టైగర్‌ చిత్రానికి ఎటువంటి రీషూట్‌లు జరగలేదని నిర్మాత పదే పదే చెప్పడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. 

అదేమిటంటే అఖిల్‌ చిత్రం సి.జి. వర్క్‌ వల్ల రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అవ్వలేదని, కొన్ని సీన్స్‌ సంతృప్తికరంగా లేకపోవడంవల్ల రీషూట్‌కి వెళ్ళారని ఫిలింనగర్‌ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో నిజం కూడా వుందని ట్రేడ్‌వర్గాల్లో కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాధామోహన్‌ తమ సినిమాకి రీషూట్‌లు ఏమీ జరగలేదని పదే పదే చెప్పడంతో అది అఖిల్‌ చిత్రాన్ని ఉద్దేశించి అన్నట్టుగా వుందని చెప్పుకుంటున్నారు. రాధామోహన్‌ ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నా రీషూట్‌లు చేసుకుంటున్న అఖిల్‌ గురించే ఆయన ప్రస్తావించినట్టు అందరూ భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ