Advertisementt

బెంగాల్ టైగర్ వాయిదాకు కారణం..!

Sat 31st Oct 2015 07:49 PM
bengal tiger movie,raviteja,thamanna,sampath nandi,radhamohan  బెంగాల్ టైగర్ వాయిదాకు కారణం..!
బెంగాల్ టైగర్ వాయిదాకు కారణం..!
Advertisement

ఎన‌ర్జికి బ్రాండ్‌ ఎంబాస‌డ‌ర్ గా త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసి అభిమానుల‌కి, ప్రేక్షుక‌ల‌కి కిక్కిచ్చే మాస్ మహరాజ రవితేజ న‌టించిన బెంగాల్‌టైగ‌ర్ చిత్రం విడుద‌ల‌కి సిద్దంగా వుంది. ఈ సంద‌ర్బంగా.. 

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. మా బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఎటువంటి రీషూట్ లు చేయ‌టం లేదు. ఇటీవ‌ల ప్యాచ్‌వ‌ర్క్ తో గ‌మ్మ‌డికాయ కొట్టేసాము. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిచేసుకున్నాము. మా చిత్రాన్ని ముందుగా నవంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాము. అయితే అఖిల్ చిత్రం పోస్ట్‌పోన్ కావ‌టంతో న‌వంబ‌ర్ 5న రావ‌టం కుద‌ర‌లేదు. గ్లోబల్ ఫిల్మ్‌డిస్ట్రిబ్యూష‌న్ వారు మా చిత్రం మ‌రియు అఖిల్ చిత్రం యొక్క తెలంగాణా రాష్ట్ర పంపిణి రైట్స్ కొనియున్నారు కావున రెండు పెద్ద‌చిత్రాలు విడుద‌ల‌కి గ్యాప్ కావ‌సివుంది. ఇరువురు సంప్ర‌దింపులు జ‌రిపాక విడుద‌ల తేదిని ఎనౌన్స్ చేస్తాము. మా చిత్రం ఏ డేట్‌కైనా విడుద‌ల‌కి సిద్దంగా వుంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మా చిత్ర యూనిట్ అంద‌రి స‌హ‌యంతో పూర్తిచేశాము. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవ‌ల మా బెంగాల్ టైగర్ ఆడియోకి సూపర్ రెస్పాన్స్ రావ‌ట‌మే కాకుండా సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ప్రేక్ష‌కుల నాడి బాగా తెలుసు. ఈ విష‌యం రేపు చూసిన ప్రేక్ష‌కులు చెప్తారు. ఈచిత్రం ర‌వితేజ గారి కెరీర్ లో బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ గా నిలుస్తుంద‌ని మా న‌మ్మ‌కం.. అని అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement