Advertisementt

కొత్తబాటలో మహేష్‌..!

Sat 31st Oct 2015 05:30 PM
mahesh babu,sreemanthudu,thmail director murugadoss,  కొత్తబాటలో మహేష్‌..!
కొత్తబాటలో మహేష్‌..!
Advertisement
Ads by CJ

సినిమా మాధ్యమం ద్వారా సందేశాలు చెబితే, అందునా మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌ సినిమా ద్వారా సామాజిక సందేశం అందిస్తే అది సూపర్‌హిట్టు కావడమే కాదు... స్వయంగా ఎందరికో మంచి స్పూర్తినిస్తుంది. ఈ విషయాన్ని మహేష్‌బాబు తన శ్రీమంతుడు చేత నిరూపించాడు. తన కెరీర్‌లో మొదటిసారిగా ఆయన సందేశం అందిస్తూ గ్రామాల దత్తత విషయాన్ని సెంటర్‌పాయింట్‌గా తీసుకొని చేసిన ఈ చిత్రం మహేష్‌కు సూపర్‌డూపర్‌ హిట్‌ను అందించడమే కాదు... ఎందరికో ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచింది. శ్రీమంతుడు ఇచ్చిన రిజల్ట్‌తో పూర్తి హ్యాపీగా ఉన్న మహేష్‌ త్వరలో మరో సందేశాత్మక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. సామాజిక సందేశాన్ని అందిస్తునే దానికి కమర్షియల్‌ హంగులు అద్దడంలో తమిళ దర్శకుడు మురుగదాస్‌కు మంచి పేరుంది. కాగా త్వరలో మహేష్‌ మురుగదాస్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా మంచి సందేశాత్మకంగా రూపొందించే పనిలో మురుగదాస్‌ కసరత్తు చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా మహేష్‌-మురుగదాస్‌లు ఎలాంటి సందేశం అందిస్తారో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ