చివరి అస్త్రం తీసిన తాప్సి..!

తన అమ్ములపొదిలోని చివరి అస్త్రాన్ని బయటకు తీసింది హీరోయిన్‌ తాప్సి. అందాలకు తెరతీస్తూ చిట్టిపొట్టి డ్రస్‌లతో, కాస్ట్యూమ్స్‌తో యువతరం మతులు పోగొడుతోంది. జిక్యూ మేగజైన్‌కు హాట్‌హాట్‌ ఫొటోలతో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేని ఈ భామ తమిళంలో శింబు సరసన సెల్వరాఘవన్‌ డైరెక్షన్ లో రూపొందుతున్న కాన్‌ సినిమాలో నటిస్తోంది. ఇక హిందీలో ఆమె రన్నింగ్‌ షాదీ డాట్‌కామ్‌ అనే చిత్రంలో చేస్తోంది. సాహసం తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో చాన్స్‌లు లేవు. గంగ, బేబి వంటి పరభాషా చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులను కనిపించింది. ఈమె ఎక్స్‌పోజింగ్‌ ఫొటోలతో అందరిలో సెగలు పుట్టిస్తోంది. అదరిపోయే హాట్‌షో చేస్తోంది. ఇక కాన్‌, రన్నింగ్‌ షాదీ డాట్‌కామ్‌లు హిట్టయితేనే ఈ అమ్మడికి కెరీర్‌ ఉంటుంది. లేకపోతే తెరమరుగయ్యే పరిస్థితి రాకతప్పదు. మొత్తానికి ఈసారి తాప్సి తన అభినయంతో పాటు అందాలను కూడా నమ్ముకొంది. మరి అదృష్టం ఆమెను వరిస్తుందో లేదో చూడాలి..! 

thapsee ponnu
hot photo shoot
kaan movie
running shadi dot com