Advertisementt

రామ్‌చరణ్ ఎక్కడున్నాడు?

Sat 31st Oct 2015 02:14 PM
ram charan,bruce lee,mega power star,bruce lee the fighter,ram charan tour,chiranjeevi  రామ్‌చరణ్ ఎక్కడున్నాడు?
రామ్‌చరణ్ ఎక్కడున్నాడు?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా.. టాలీవుడ్‌లో మెల్లగా నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న రామ్‌చరణ్ ఆశల మీద బ్రూస్‌లీ చిత్రం ఒక్కసారిగా నీళ్లు జల్లింది. ఎన్నో ఆశలతో... కష్టపడి చేసిన బ్రూస్‌లీ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్‌గా నిలవడంతో చరణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడట. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని.. పక్కా ప్లానింగ్‌తో విడుదల చేసిన ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం మెగాకాంపౌండ్‌లో తీవ్ర కలవరం మొదలైంది. మరీ తీసిపారేసే సినిమా కూడా కాదు. ఇంకా ముఖ్యంగా తను రీఎంట్రీ ఇచ్చినా... ఆరేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించినా.. సినిమా ఇలా జరగడం చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆల్‌రెడీ ఇలా ఎవరూ ఊహించని రీతిలో రామ్‌చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా బ్రూస్‌లీ నిలవడంపై చిరంజీవి పోస్ట్‌మార్డమ్ స్టార్ట్ చేశాడట. అయితే బ్రూస్‌లీ పరాజయం విషయం తనను బాగా కలిచివేస్తుండటంతో.. చరణ్ హాలీడే ట్రిప్‌కు వెళ్లాడట. అయితే ఎక్కడికి వెళ్లాడనేది.. ఆయన ఎక్కడా సేదతీరుతున్నాడనే విషయాన్ని మెగాకాంపౌండ్ రహస్యంగా వుంచిందట. దాదాపుగా నెలరోజుల తర్వాతనే చరణ్ ఇండియాకు తిరిగిరానున్నాడని సమాచారం. ఏది ఏమైనా బ్రూస్‌లీ చిత్రం చరణ్‌ను ఇండియాను వదిలివెళ్లేటట్లు చేసిందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ