వరుస పరాజయాల తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్ చిత్రాలతో మళ్ళీ నితిన్ కెరీర్‌లో గాడిలో పడింది. అయితే ఈ మధ్యలోనే అఖిల్ అక్కినేనిని అరంగ్రేటం చేసే బాధ్యతను భుజాలపై వేసుకుని నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. ఇందుకోసం తను హీరోగా చేసే సినిమాలను కొన్నాళ్లు వదులుకొని.. కావాలనే ఫోకస్‌లో లేకుండా, వున్న నితిన్‌కు తాజాగా మళ్ళీ కష్టం వచ్చిపడింది. తనకు వరుస పరాజయాలు వచ్చినప్పుడు కూడా టెన్షన్ పడని నితిన్‌కు ఇప్పుడు అక్కినేని నాగార్జున తెగ టెన్షన్ పెడుతున్నాడట. తన తనయుడు అఖిల్ పరిచయ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన నాగ్ ఆ సినిమా పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడట. అఖిల్ తొలిచిత్రంగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అఖిల్ ఫైనల్ అవుట్‌పుట్‌పై సంతృప్తిగా లేని నాగార్జున విడుదల తేదని కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన బాగా లేని సన్నివేశాలు రీషూట్ చేయాలని, అసలు కేర్ తీసుకోకుండా చిత్రాన్ని చుట్టేశారని నాగార్జున, నితిన్‌ను, ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డిని ఒత్తిడి గురిచేస్తున్నాడట. అంతేకాదు చిత్ర విడుదల తేదీ విషయంలో కూడా నాగ్ రాజీపడటం లేదు. ఇవన్నీ చూస్తున్న నితిన్ స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం అయ్యో నితిన్.. నీకు అవసరమా? అని జాలిపడుతున్నారట.