Advertisementt

సీనియర్‌ హీరోతో యువహీరో పోటీ..!

Sat 31st Oct 2015 12:30 PM
kamal hassan,cheekati rajyam movie,akhil akkineni,akhil movie  సీనియర్‌ హీరోతో యువహీరో పోటీ..!
సీనియర్‌ హీరోతో యువహీరో పోటీ..!
Advertisement
Ads by CJ

లోకనాయకుడు కమల్‌హాసన్‌కు తెలుగులో కూడా ఎంతో క్రేజ్‌ ఉంది. ఆయన చిత్రాలు ఎలా ఉన్నా... వాటిని చూసి అందులోని కమల్‌ నటనను చూడాలనుకునే వారికి ఇక్కడ కొదవలేదు. కాగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం చీకటిరాజ్యం. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌, త్రిష, ప్రకాష్‌రాజ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. తమిళంలో ఈ చిత్రం తూంగవనం గా రూపొందింది. ఈ ద్విభాషా చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నవంబర్‌ 10వ తేదీన దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని కమల్‌ సోదరుడు చంద్రహాసన్‌ నిర్మిస్తుండగా, కమల్‌ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజేష్‌. ఎం. సెల్వం దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఆ మరుసటి రోజే అంటే నవంబర్‌ 11న అక్కినేని అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేస్తోన్న అఖిల్‌ మూవీ తెలుగు, తమిళంలో రిలీజ్‌ కానుంది. సో.. లోకనాయకుడుని యంగ్‌ హీరో ఎలా ఎదుర్కొని బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తాడో చూడాలని అందరూ వేచిచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ