మారుతి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో వెంకీ.. డైరెక్టర్ క్రాంతి మాధవ్ తో చేయాల్సిన చిత్రాన్ని పక్కన పెట్టేసి మొదట మారుతి చిత్రానికే శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ(రాధాకృష్ణ) నిర్మిస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించకుండా.. ప్రాజెక్ట్ తమకు అప్పగిస్తే రెండు కోట్లు ముట్టజెప్పుతామని యు.వి.క్రియేషన్స్ అధినేతలు, నిర్మాత రాధాకృష్ణ కు ఆఫర్ చేసారట. ఇలా ఆఫర్ చేయడానికి కారణం.. డైరెక్టర్ మారుతి కి ఉన్న క్రేజ్ అనే అర్ధమవుతుంది. రీసెంట్ గా యు.వి క్రియేషన్స్ మారుతి దర్శకత్వంలో నిర్మించిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అయింది. బడ్జెట్ విషయంలో మారుతి చాలా జాగ్రత్తగా ఉంటాడు. అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా.. తక్కువలోనే సినిమా పూర్తి చేస్తాడు. దీంతో మారుతి చేయబోయే ఈ చిత్రాన్ని కూడా యు.వి.క్రియేషన్స్ వారే నిర్మించాలని భావించి, రాధాకృష్ణ కు రెండు కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాధాకృష్ణ మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు.