రీసెంట్ గా తమిళ నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన నాజర్ సైజ్ జీరో సినిమా తమిళ ఆడియో వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో.. నాజర్ అనుష్క గురించి, సైజ్ జీరో సినిమా కోసం తను పడ్డ కష్టం గురించి, చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. అనుష్క నా కూతురని, తనని నేను దత్తత తీసుకున్నానని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాకు ఈ ఆడియో వేడుకకు ఎలాంటి సంబంధం లేదని.. అనుష్క తండ్రిగా ఈ కార్యక్రమానికి వచ్చానని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో అనుష్క మేకప్ వేసుకోకుండా నిజంగా బరువు పెరిగిందని నటన పట్ల తనకున్న డెడికేషన్ మరెవరికి లేదని ఆయన చెప్పారు.