రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని పొందిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం బిజినెస్ 60కోట్లకుపైగానే జరిగింది. అయితే ఈ చిత్రానికి 40కోట్ల షేర్ రావడం కూడా కష్టమని తేలిపోయింది. ఈ చిత్రాన్ని పోటీపడి మరీ ఎక్కువ రేట్లకు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి గందరగోళంగా మారింది. వారు తమ నష్టాలను చెల్లించి వెంటనే సెటిల్‌మెంట్ చేసుకోమని ఫిల్మ్‌చాంబర్ పెద్దలను కలిసి సెటిల్‌మెంట్‌కు కూర్చున్నట్లు సమాచారం. అయితే మెగాక్యాంప్ వెంటనే అలర్ట్ అయి వివాదం పెద్దది కాకుండా వారికి తదుపరి చిత్రం పంపిణీహక్కులు ఇస్తామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సురేందర్‌రెడ్డితో తని ఒరువన్ కు రీమేక్‌గా రామ్‌చరణ్ హీరోగా నటించే చిత్రం పంపిణీహక్కులను ఇస్తామని మెగాక్యాంపు హామీ ఇచ్చినట్లు సమాచారం.