యంగ్ తరంగ్ దర్శకుడు మారుతి కొద్ది కాలం కిందట విక్టరీ వెంకటేష్, నయనతారలతో రాధ అనే చిత్రం ప్రారంభించాడు. కానీ కాపీ వివాదంతో ఆ చిత్రం ఆగిపోయింది. దీంతో కసి మీద ఉన్న మారుతి భలే భలే మగాడివోయ్ విజయంతో అందరి విమర్శకులకు సమాదానం ఇచ్చాడు. రాధ స్టోరీని పక్కనపెట్టి అంతకంటే మరింత కసితో ఓ సబ్జెక్ట్‌ను రెడీ చేసి వెంకీ చేత గ్రీన్‌సిగ్నల్ వేయించాడు. కాగా ఈ చిత్రంలో కూడా నయనతారను వెంకీకి జోడీగా తీసుకున్నాడు. గతంలో వెంకీ-నయనతార కాంబినేషన్‌లో లక్ష్మీ, తులసి చిత్రాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. ముచ్చటగా మూడోసారి ఈ జంట మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. అనామిక తర్వాత నయనతార మరలా తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.