మొత్తానికి రాజమౌళి బాహుబలి2 స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది. రాజమౌళి స్క్రిప్ట్‌ను లాక్ చేసేశాడు. లోకేషన్ల వేట కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి యుద్ద సన్నివేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నాడట. పార్ట్1లో వార్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అయినా అవి అంతర్జాతీయ స్థాయిలో లేవని జక్కన్న అంగీకరిస్తున్నాడు. అందుకే ఈసారి మాత్రం అంటే పార్ట్ 2లో యుద్ద సన్నివేశాలను అంతర్జాతీయస్థాయిలో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నాడట. ముఖ్యంగా ప్రబాస్-రానాల మధ్య వచ్చే వార్ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయని సమాచారం. ఈ వార్ సీన్స్ దాదాపు సినిమాలో 40 నిమిషాల పాటు ఉంటాయట. ముఖ్యంగా కత్తి యుద్దాలు ఈ పార్ట్2కు హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు. పార్ట్ 1 కంటే పార్ట్2ను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాలని జక్కన్న నిర్ణయించుకున్నాడు. దానికి తోడు ఈసారి రాజమౌళి ఎంత అడిగితే అంత బడ్జెట్ కేటాయించడానికి నిర్మాతలు కూడా సిద్దంగా ఉన్నారు. సో... మరో విజువల్ ఫీస్ట్‌కు తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు సిద్దంగా ఉండాలన్న మాట..!