రామ్‌చరణ్‌కు వరుసగా అపజయాలు పలకరిస్తున్నాయి. నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకులు ఆయనకు సరైన హిట్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో బాబాయ్ పవన్‌కళ్యాణ్ రామ్‌చరణ్ కెరీర్‌ను గాడిలో పెట్టడానికి నిర్ణయించుకున్నాడట. త్వరలో రామ్‌చరణ్ హీరోగా పవన్‌కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఓ స్టోరీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కళ్యాణ్‌కు వినిపించాడు. స్టోరీ అద్బుతంగా ఉండటంతో పవన్ ఈ స్టోరీ చరణ్‌కి అయితే బాగా సూట్ అవుతుందని చెప్పి, చరణ్‌తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను సైతం ఒప్పించాడట. మొత్తానికి ఫ్లాప్‌లలో ఉన్న అబ్బాయ్‌ను బాబాయ్ ఈ విషయంలో బాగా కరుణించినట్లు కనిపిస్తోంది. సో.. త్వరలో పవన్‌కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రం పట్టాలెక్కడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.