కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్. ఆమె తక్కువ కాలంలోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. అయితే వచ్చిన క్రేజ్‌ను ఆమె నిలబెట్టుకోలేకపోయింది. వ్యభిచారం కేసులో ఇరుకుని అప్రతిష్టపాలు అయింది. ఇక సినిమా అవకాశాలు దక్కడం అసాధ్యమని తెలుసుకొని, ఇప్పుడు బుల్లితెరపై దృష్టి పెట్టింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని సీరియల్స్‌లో ఆమె నటించింది. ఆ పరిచయాలతోనే డర్ సబ్‌కో లగ్‌తా మై అనే హర్రర్ సీరియల్‌లో నటించనుంది. సినిమాలు, సీరియల్స్ ఎక్కడైనా నటించడమే కదా..! బుల్లితెరను తక్కువగా అంచనా వేయవద్దు. బుల్లితెరపై అద్బుతాలు సృష్టించవచ్చు. అయినా నేను డబ్బుల కోసం ఈ సీరియల్‌లో నటించడం లేదు. ఈ సీరియల్‌లోని కంటెంట్ అంత స్టఫ్‌గా ఉండటంతో ఒప్పుకొన్నాను.. అంటూ బుకాయిస్తోంది.