Advertisementt

రాజుగారు మరలా వస్తున్నారు..!

Thu 29th Oct 2015 09:52 PM
ms raju,pouranami movie,sumanth arts,sumanth ashwin  రాజుగారు మరలా వస్తున్నారు..!
రాజుగారు మరలా వస్తున్నారు..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు సుమంత్‌ ఆర్ట్స్‌ బేనర్‌ నుంచి సినిమా వస్తోందంటే అది సూపర్‌హిట్‌ కొట్టడం ఖాయమనుకొనే వారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు... ఇలా యం.యస్‌.రాజు నిర్మించిన చిత్రాలు భారీ సక్సెస్‌లను సాధించాయి. అయితే పౌర్ణమి చిత్రం ఆయనకు తీవ్రమైన నష్టాలను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన డైరెక్టర్‌గా మారి తీసిన వాన చిత్రం కూడా ఆయనను ఇక కోలుకోనివ్వకుండా చేసింది. దీంతో ఆయన తాత్కాలికంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. కాగా ఇటీవలే ఆయన బేనర్‌ అయిన సుమంత్‌ఆర్ట్స్‌ 25ఏళ్లను పూర్తి చేసుకొంది. ఈ సందర్బంగా ఎమ్మెస్‌రాజు త్వరలో తాను మరలా తన బేనర్‌పై సినిమాలు నిర్మిస్తానని తన సన్నిహితులతో చెప్పాడని విశ్వసనీయ సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం రాజు త్వరలో ఓ స్టార్‌హీరోతో సినిమా నిర్మించనున్నాడు. అంతేకాదు.. తన కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించే పనిలో కూడా ఆయన బిజీగా ఉన్నాడు. మరి ఆయన తాజా ఇన్నింగ్స్‌ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ