ప్రభాస్, రాజమౌళిల బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కథ, కథనాల కన్నా టెక్నికల్ టీమ్‌కే ఎక్కువ మార్కులు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టేకింగ్, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ వర్క్.. ఇలా టెక్నీషియన్స్ అందరి కృషివల్లే సినిమా టాప్ రేంజ్‌కి వెళ్ళింది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి2 ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా వున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ని డిసెంబర్‌లో ప్రారంభించే అవకాశం వుంది.
ఇదిలా వుంటే రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ మగధీర. ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వర్క్ చేసిన కమల్ కణ్ణన్ నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాహుబలి2 కోసం కమల్ కణ్ణన్‌ని మళ్ళీ పిలిపిస్తున్నాడు రాజమౌళి. బాహుబలికి అతనితో వర్క్ చేయించకుండా బాహుబలి2కి ఎందుకు పిలిపిస్తున్నాడన్నది అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. బాహుబలికి చేసిన విఎఫ్‌ఎక్స్ వర్క్ అతనికి నచ్చలేదా? లేక బాహుబలి2కి మరింత గ్రాండియర్ తీసుకు రావాలన్న ఆలోచనతో కమల్‌ని పిలిపిస్తున్నాడా? అనేది తెలియాల్సి వుంది. మొత్తానికి మరో టాప్ టెక్నీషియన్ బాహుబలి2 టీమ్‌లో చేరుతున్నాడు. అదీ సంగతి.