Advertisementt

మణిరత్నం సినిమా ఆగిపోయిందా..?

Thu 29th Oct 2015 03:32 PM
maniratnam,ok kanmani,dulkar salman,nani,nithyamenon  మణిరత్నం సినిమా ఆగిపోయిందా..?
మణిరత్నం సినిమా ఆగిపోయిందా..?
Advertisement
Ads by CJ

ఓకే కన్మణి సాధించిన విజయంతో మరలా హిట్‌ ట్రాక్‌ ఎక్కిన క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం... తన తర్వాతి చిత్రంగా కార్తి-దుల్కర్‌సల్మాన్‌, కీర్తిసురేష్‌, నిత్యామీనన్‌లతో ఓ భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేశాడు. కానీ దుల్కర్‌ సల్మాన్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో తెలుగు హీరో నానిని ఆ స్థానంలోకి తీసుకున్నాడు. ఈ చిత్రంలో మణిరత్నం డైరెక్షన్‌లో నటించే అవకాశం రావడంతో నాని సైతం తనకు వచ్చిన ఇతర ఆఫర్స్‌ను కాదని, మణి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసినట్లు కోలీవుడ్‌ సమాచారం. కానీ కొందరు మాత్రం ఈ చిత్రం ఆగిపోలేదని, కేవలం పోస్ట్‌పోన్‌ అయింది అని అంటున్నారు. కానీ మణిరత్నం మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టి ధనుష్‌తో ఓ సినిమాను తీసే పనిలో పడ్డాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ