రాఘవలారెన్స్ తానే నటించి, దర్శకత్వం వహించిన ముని సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం నాలుగో సీక్వెల్ రెడీ చేస్తున్నాడు. ముని, కాంచన, గంగ లుగా వచ్చిన మూడు చిత్రాలు తమిళనాటనే కాకుండా తెలుగునాట కూడా సంచలన విజయాలు నమోదుచేశాడు. తాజాగా వచ్చిన గంగ చిత్రం తెలుగు వెర్షన్‌ను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఏకంగా 16కోట్లు పెట్టి కొన్నాడు. ఈ చిత్రం తెలుగునాట కూడా అద్భుత కలెక్షన్లు సాధించింది. దాంతో ప్రస్తుతం ముని సిరీస్‌లో భాగంగా నాలుగో చిత్రంగా రూపొందుతున్న చిత్రానికి తమిళంలో నాగ అనే టైటిల్‌ను పెట్టారు. కాగా ఇదే చిత్రానికి తెలుగులో భైరవ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు తెలుగు నిర్మాతలు పోటీపడుతున్నారు. కానీ లారెన్స్ ఈ చిత్రానికి 20కోట్ల పైచిలుకు మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ అంత మొత్తాన్ని ఇవ్వడానికి ఆల్‌రెడీ ఓ నిర్మాత ముందుకొచ్చి సినిమా హక్కులను చేజిక్కించుకునేందుకు ఎదురుచూస్తూ ఉండటం గమనార్హం.