చిరంజీవికి సినిమాల పరంగా, కథల పరంగా మంచి జడ్జిమెంట్ ఉంది. ఇంతటి పొడగాటి కెరీర్లో మెగా స్టారుగా ఎనలేని పేరు ప్రతిష్టలు సంపాదించింది కేవలం ఆ జడ్జిమెంట్ వల్లే అన్నది మళ్ళీ నొక్కి చెపాల్సిన అవసరం లేదు. పుత్రుడు రామ్ చరణ్ కెరీర్ విషయంలో చిరంజీవి ఆచి తూచి అడుగులు వేస్తుండడం, అన్నింటా స్పూన్ ఫీడింగ్ ఇస్తుంటాడు అన్న అపవాదు ఎప్పటి నుండో ఉండనే ఉంది. ప్రస్తుతం బ్రూస్ లీ సంగతికొస్తే శ్రీను వైట్ల ముందుగా చెప్పిన గ్యాంగ్ లీడర్ లాంటి స్టోరీ ఫ్లేవర్ నచ్చే ప్రాజెక్ట్ ఓకే చేసాడు. తదనంతర దశల్లో మార్పులు చేర్పులు కారణంగా కోన, గోపి, వైట్ల గ్యాంగ్ చేతుల్లో గ్యాంగ్ లీడర్ కాస్తా బొక్క బోర్లా పడింది.
రిలీజుకు సరిగ్గా అయిదు రోజులు ముందుగా వైట్ల కేవలం చిరు కోసమే ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినప్పుడే ఈ సినిమా భవితవ్యం తెలిపోయిందట. చిరంజీవి గారు చిరాగ్గా సెకండ్ హాఫ్ మొత్తం వీక్షించాకుండానే వెనుదిరిగినప్పుడే ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అన్న దృడ నిశ్చయానికి వచ్చాడట నిర్మాత దానయ్య. ఆఖరి నిమిషంలో కేవలం నిర్మాత శ్రేయస్సు కోసమే చిరంజీవి గారు బ్రూస్ లీ విడుదలకు ఆటంకం కలగకుండా చూసారు గానీ లేకుంటే రీ-షూట్ చేయించి ఉండేవారన్నది ఓ వాదన. వైట్ల పైత్యానికి రామ్ చరణ్ ఇలా బలయ్యాడు. ఇంతోటి దానికి చిరంజీవి క్యామియో పేరిట మరో కళంకం తీసుకొచ్చాడు.