బాహుబలి విడుదలైన తర్వాత యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. విడుదలైన అన్నిభాషల్లోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో హీరో ప్రభాస్‌కు జాతీయ, అంతర్జాతీయపరంగా గుర్తింపు లభించింది. తాజాగా ఆయనకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయనే వార్తలు మొదలయ్యాయి. నిజమో కాదో తెలియదు కానీ.. ప్రభాస్‌కు ఇటీవల జాకీచాన్ నటిస్తున్న ఓ హాలీవుడ్ చిత్రంలో కీలకపాత్రతో పాటుతో పాటు మరో హాలీవుడ్ దర్శకునితో హీరోగా అవకాశం వచ్చిందని అంటున్నారు. మరోపక్క ఆయన బాలీవుడ్‌లో సూపర్‌హిట్ బ్రాండ్ అయిన ధూమ్-4 లో ప్రభాస్ నటించనున్నాడని, అలాగే కరణ్‌జోహార్ భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా ఆ చిత్రం నిర్మించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవే నిజమైతే ఆయన నటించే తెలుగు చిత్రాలు ఇక పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు.