లోకనాయకుడు కమల్‌హాసన్‌కు ఈమధ్య సరైన సక్సెస్ రాలేదు. ఆయన నటించిన ఉత్తమవిలన్ తమిళ, తెలుగు భాషల్లో డిజాస్టర్‌గా నిలిచిరది. అయితే తమిళంలో ఆయన తన సహచరి గౌతమితో కలిసి నటించిన దృశ్యం రీమేక్ పాపనాశం ఫర్వాలేదనిపించుకొంది. దీంతో ఊపిరి పీల్చుకున్న కమల్ ఇప్పుడు విశ్వరూపం2 తో పాటు చీకటిరాజ్యం పై ఫోకస్ పెట్టాడు. తమిళంలో తూంగవనంగా, తెలుగులో చీకటిరాజ్యంగా ద్విభాషా చిత్రంగా రూపొందింది. ఎప్పుడో చేసిన ఈనాడు తర్వాత కమల్ నటించిన మరో ద్విభాషా చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్‌ను కూడా ఆయన కేవలం 40రోజుల్లో పూర్తిచేశాడు.. దీపావళి కానుకగా ఈచిత్రం విడుదల అవుతుందని సమాచారం. అయితే ఆయన సినిమాలు చేస్తున్న పద్దతిని మాత్రం అందరూ విమర్శిస్తున్నారు. ఇంత సీనియర్ అయివుండి కూడా తన సినిమాలకు తన సినిమాలే పోటీ అన్నట్లుగా వరుస చిత్రాలు చేయడం కొందరికి నచ్చడం లేదు. కాగా ఆయన చేతిలో ఇప్పటివరకు 8 స్టోరీలు సినిమాలుగా చేయడానికి రెడీగా ఉన్నాయని ఆయన స్వయంగా ప్రకటించాడు. ఏడాదికి ఐదు చిత్రాలు చేయడం తన టార్గెట్ అని చెప్పిన ఆయన విమర్శకుల విమర్శలను పట్టించుకోవడం లేదు... మరి ఈ లోకనాయకుడు శైలి ఆయనకు ప్లస్ అవుతుందా? లేక ఆయన కెరీర్‌కే ఇబ్బందిగా మారుతుందా? అనేది వేచిచూడాలి...!