బాహుబలి చిత్రంతో తమిళనాట ప్రభాస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్‌కు కూడా తెలుగులో కంటే తమిళంలోనే క్రేజ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని భావించిన కొందరు చోటా నిర్మాతలు ప్రభాస్-రాఘవలారెన్స్-తమన్నా వంటి వారికి తమిళంలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా తెలుగులో రెబెల్ గా రూపొంది డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసిన ఈ చిత్రాన్ని తమిళంలోకి వీరబలి అనే టైటిల్‌తో అనువాదం చేసి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తమిళంలోని చోటా చోటా నటీనటులతో కొన్ని సీన్స్ తీసి వాటిని ఈ అనువాదనికి కలపనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి పెట్టిన వీరబలి టైటిల్‌ను కూడా బాహుబలి తమిళ వెర్షన్‌కు పెట్టాలని రాజమౌళి ఆలోచించాడు. బాహుబలికి తమిళంలో మహాబలి, వీరబలి అనే టైటిల్స్‌ను పరిశీలించిన సంగతి తెలిసిందే. మరి ఆ టైటిల్స్‌లో ఒక దాన్ని రెబెల్ కు వాడుతున్నారు. మరి తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో ఏమాయ చేస్తుందో చూడాలి...!