దర్శకుడు క్రిష్‌ను ఇక క్రియేటివ్ జీనియస్ అని పిలవాలనేది వాస్తవం. కేవలం ఒకే ఒక్క జోనర్‌కు పరిమితం కాకుండా తన చిత్రాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఆయన విపరీతంగా కట్టిపడేస్తున్నారు. కాగా ఈ మధ్య బాలీవుడ్‌లో రమణ, ఠాగూర్ లకు రీమేక్‌గా గబ్బర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించినప్పటికీ రీమేక్ మూవీ కావడంతో క్రిష్‌ను అక్కడివారు సరిగ్గా పట్టించుకోలేదు. కాగా ఇటీవల కంచె చిత్రాన్ని చూసిన ఓ బడా ప్రొడ్యూసర్ నుండి క్రిష్‌కు పిలుపు వచ్చిందని, త్వరలో క్రిష్ తన సొంత కథతో బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. అయితే క్రిష్‌కు ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్స్ సైతం ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరి ముందు తెలుగు సినిమా చేసి బాలీవుడ్ వెళ్తాడా? లేక బాలీవుడ్ చిత్రం తర్వాత తెలుగులో సినిమా చేస్తాడా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి తన సృజనాత్మకతను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా రుచిచూపిస్తాడా? అనేది వేచిచూడాలి..!