విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్‌కి కాస్త పబ్లిసిటీ పిచ్చి ఎక్కువే. తన సినిమాల కలెక్షన్లు పెంచుకోవాలని, స్టార్‌హీరోగా ఎదగాలని నిఖిల్ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అంతేకాదు ఇందుకోసం తన పబ్లిసిటీని తనే చేసుకుంటూ.. తన సినిమాల కలెక్షన్ల విషయంలో.. శాటిలైట్ రైట్స్ రేటు విషయంలో మీడియాని పక్కదారి పట్టిస్తున్నాడు. గతంలో కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య కలెక్షన్లను నిర్మాతలచే రెట్టింపు చేసి బలవంతంగా చెప్పించిన నిఖిల్.. శాటిలైట్ రైట్స్ రేటు విషయంలో కూడా తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం శంకరాభరణం శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సంస్థ 4కోట్లకు కొనుగోలు చేసిందని సోషల్‌మీడియాలో హల్‌చల్ చేయించాడు నిఖిల్. అయితే వాస్తవంగా జీ తెలుగు సంస్థ ఆ చిత్ర శాటిలైట్ రైట్ హక్కులను 2కోట్ల 60 లక్షలకు కొనుగోలు చేసిందని తెలిసింది. అయితే ఇది నిఖిల్ కెరీర్‌లో ఆయన చిత్రానికి లభించిన అత్యధిక రేటే.. అయితే నిఖిల్ దీనిని కాస్త ఎక్కువ చేసి 4 కోట్లు అనే న్యూస్‌ని హల్‌చల్ చేయించాడు. సో.. ఇది తెలిసిన వారంతా నిఖిల్ కాస్త తగ్గితే బెటర్ అని సలహాలిస్తున్నారు.